పాఠశాలకు పూర్వ విద్యార్థి విరాళం
లైబ్రరీ, సైన్స్ అండ్ సోషల్ ల్యాబ్ డెవలప్మెంట్‌కు సహకారం
కోదాడ, జూలై 19 :కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, కోదాడ నివాసి తుమ్మ భాస్కర్ పాఠశాల లైబ్రరీ పుస్తకాలకు రూ10 వేలు, సైన్స్, సోషల్ ల్యాబ్ రూ 10 వేలు కేటాయించి పుస్తకాలు ల్యాబ్ మెటీరియల్ తీసుకొచ్చి ఆదివారం అందించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ సలీం షరీఫ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థి భాస్కర్కు ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు. తాను చదువుకున్న బడి బలోపేతానికి విద్యార్థుల విద్యా ప్రగతికి తోడ్పడునందించడం ,దీన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని పూర్వ విద్యార్థులు ప్రభుత్వ బడుల బలోపేతానికి పడాలని తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, యాద రమేష్, తుమ్మ ప్రసాద్ ,వెంకన్న ,బంగారు నాగమణి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






