19 August, 2026 | 2:01 AM

పేద విద్యార్థులకు దాతలు చేయూతనందించాలి

19-08-2026 12:44 AM

మహబూబాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): పేద విద్యార్థుల అభ్యున్నతికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు తగినంత సహాయం అందించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో 550 మంది విద్యార్థులకు డాక్టర్ కళ్యాణ్ జోష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. యవ్వన దశలో వచ్చే మార్పులను,

ఇతర ఆరోగ్య సమస్యలను ఎవరికి చెప్పకపోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, వెంటనే తల్లిదండ్రులకు, మిత్రులకు చెప్పి డాక్టర్ను సంప్రదించి సరైన వైద్య సహాయం పొందడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించవచ్చని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ వీరారెడ్డి విద్యార్థుల కోసం 5000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి,  ప్రిన్సిపల్ సదానందం, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.