19 August, 2026 | 2:24 AM

బీజేపీకి అనుబంధ సంస్థగా ఈసీ

19-08-2026 12:43 AM
  1. సర్ పేరుతో ఓట్ల తొలగింపు
  2. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎన్నికల సంఘం తెలంగాణలో ఓట్ల ను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోందని టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు.  ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడు తూ.. రాజీవ్‌గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పిస్తే, బీజేపీ ఓటు హక్కును తొలగించేలా కుట్రలు చేస్తోందని, ప్రతిపక్షాల మీద  కేసు లు పెడుతున్నారని మండిపడ్డారు. బీహార్,  బెంగాల్‌లో మాదిరిగానే తెలంగాణలో ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు.