calender_icon.png 11 July, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాతలు బాలసదనం బాలలతో గడపండి

11-07-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, జూలై 10 (విజయ క్రాంతి)దాతలు ఎవరైనా వారి పుట్టినరోజు, పండగలు లేదా ముఖ్యమైన రోజులను  బాలసదనం బాలలతో గడిపి పిల్లలలో సంతోషాన్ని నింపాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజలకు సూచించారు. బుధవారం రాత్రి కలెక్టర్ జిల్లా కేంద్రంలోని బాలసదన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలసదనంలోని వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు.

పిల్లలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి వర్షాకాలం దృష్ట్యా పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మంచిగా చదువుకొని భవిష్యత్తులో రాణించి ఉన్నత స్థానంలో ఉండాలని పిల్లలకు సూచించారు.

కొత్త భవనం కన్స్ట్రక్షన్ గురించి కాంట్రాక్టర్, పిఆర్ డిపార్ట్మెంట్ వారితో ఆరా తీశారు. త్వరగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, సుపరిండెంట్ సంగమేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు.