10-07-2025 11:13:41 PM
మణుగూరు (విజయక్రాంతి): మాజీ శాసనసభ్యులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు(BRS Party President Rega Kantha Rao)ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) గురువారం పరామర్శించారు. కాంతారావు తల్లి నరసమ్మ మృతి చెందడడంతో ఎమ్మెల్సీ కవిత కరకగూడెం మండలం కుర్నవల్లిలోని మాజీ ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి రేగా మాతృమూర్తి నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ఓదార్చి సానుభూతి తెలిపారు. కష్టకాలంలో కాంతారావు కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆమె వెంట మాజీ ఎంపీపీ రేగా కాళీక, జాగృతి నాయకులు పాల్గొన్నారు.