11-07-2025 12:00:00 AM
గోండ్వాన సంక్షేమ పరిషత్
వెంకటాపురం నూగూరు, జూలై 10 ( విజయ క్రాంతి): విద్య హక్కు చట్టం నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాల లైసెన్స్ రద్దు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి .పూనెం సాయి డిమాండ్ చేశారు. మండలంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలన్నారు. .బుధవారం మండల విద్య అధికారి జివివి సత్యనారాయణకు ప్రైవేట్ విద్య సంస్థతో సామాన్య గిరిజనుల సమస్య పై మెమొరాండం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ మాట్లాడుతూ. విద్యాహక్కు చట్టాన్ని చట్టాన్ని పూర్తిగా అమలు చేయకపోవడంతో ప్రైవేట్ స్కూలు యజమానులు మితిమీరిన ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్లలో సరియైన వసతులు లేవని,ఈ విషయంలో ఎంఈఓ, డిఈఓ పూర్తి పర్యవేక్షణ చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.
విద్య హక్కు చట్టం నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాల లైసెన్స్ రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వమే ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు.
విద్యార్థులకు ఇదంతా చేయాలంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడని విద్యాశాఖ మంత్రి పదవీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంచుకున్నాడని, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియంచాలని అన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి ఎస్ పి మండల నాయకులు పర్శిక అనిల్ ఉన్నారు.