calender_icon.png 18 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్లైన్లో సబ్సిడీలు, బహుమతులు నమ్మవద్దు: ఎస్సై మహేశ్వర్

18-09-2025 12:56:50 AM

చివ్వెంల,(విజయక్రాంతి): పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు చివ్వేంల పోలీస్ స్టేషన్ పరిధి ఉండ్రుగొండ గ్రామం నందు పోలీసుల ఆధ్వర్యంలో సామాజిక అంశాలు అసాంఘిక చర్యలు ప్రజల భద్రత మొదలు అంశాలపై ప్రజలకు అవగాహన చైతన్య కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి  ఎస్సై లు మహేశ్వర్, రత్నం హాజరై మాట్లాడారు. అంతర్జాలం నందు సబ్సిడీలు ఉన్నాయి అని తక్కువ ధరకు వస్తువులు వస్తాయి. బహుమతులు వచ్చాయి అని ఎవరైనా అపరిచితులు ఫోన్ చేసినా, మెసేజ్లు పెట్టిన వాటికి స్పందించవద్దు.

వాటి వెనక ఆర్థికపరమైన మోసం సైబర్ నేరగాళ్లు ఉంటారని తెలిపారు. ప్రజలు చట్టాలను ఉల్లంఘిoచకుండా చట్టానికి లోబడి నడుచుకోవాలని ఒకరిపై ఒక ద్వేషాలతో భౌతిక దాడులకు పాల్పడవద్దని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్న సమరస్యంగా పరిష్కరించుకోవాలని అధికారులను పెద్ద మనుషులను ఆశ్రయించాలని సూచించారు. యువత ఆదర్శంగా ఉండాలని అలాంటి గొడవలు పెట్టుకోవద్దని బెట్టింగ్ యాప్ ల ద్వారా ఆర్థికంగా నష్టపోకూడదని సూచించారు. ఎలాంటి నేరాలు చిక్కుకున్న భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విషయం ఉన్నత చదువులు విదేశాలకు వెళ్లే విషయంలో యువతకు అడ్డంకులు ఎదురవుతాయని చట్టం పరిధిలో నడుచుకోవడం మంచిదని సూచించారు