calender_icon.png 18 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటేల్ ద్వారానే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి

18-09-2025 12:56:30 AM

సంస్థాన్ నారాయణపూర్,సెప్టెంబర్ 17(విజయ క్రాంతి):  తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సంస్థాన్ నారాయణపురం  మండల కేంద్రంలో  అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్  ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చినా నిజాం కబంద హస్తాలలోని హైదరాబాద్ సంస్థానం ప్రజలకు మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే విముక్తి లభించిందని అన్నారు.

హైదరాబాద్ సంస్థానాన్ని ఆపరేషన్ పోలో ద్వారా 1948 సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో విలీనం చేశారని అప్పుడు మాత్రమే ఇక్కడి ప్రజలకు నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించినాయని అయన అన్నారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.భారత దేశాన్ని ప్రపంచ దేశాలు తలెత్తి చూసేలా చేసిన విశ్వగురువు నరేంద్ర మోడి అని కొనియాడారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలోని రోగులకు పండ్ల పంపిణీ చేశారు

.  ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు దాసోజు వెంకటాచారి, జిల్లా నాయకులు భాస్కర నరసింహ, వంగరి రఘు,సంపతి సుధాకర్ రెడ్డి, ఎలిజాల శీను, బూస శీను ఊడుగు నాగరాజు గౌడ్ బద్దం యాదయ్య గౌడ్, గూడూరు మంజునాథ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు .