calender_icon.png 2 December, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొయ్యలను కాల్చవద్దు

02-12-2025 04:19:54 PM

మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులు పొలాల్లో వరి కొయ్యలను కాల్చవద్దని మండల వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ అన్నారు. మంగళవారం దాహేగాం మండలంలోని గిరవెల్లి, కర్జీ గ్రామాల సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలను రైతులకి వివరించారు. రైతు సోదరులు ఎవ్వరూ కూడా వరి కొయ్యలను కాల్చవద్దని తెలిపారు. సాగు విషయంలో సందేహాలుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.