02-12-2025 03:44:50 PM
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాకు చేరుకున్న ఆదిలాబాద్ లో ఈనెల 4వ తేదీన పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. మంగళవారం ముందుగా కలెక్టరేట్ వద్ద పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం నేరుగా సీఎం సభ నిర్వహించే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకున్నారు.
అక్కడ సీఎం భహిరంగ సభ జరిగే ఏర్పాట్లను జిల్లా నేతలతో కలిసి మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్ చారి, డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, నేతలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్ తదితరులు ఉన్నారు.