రైతులకు ఇబ్బందులు కల్గించొద్దు
కలెక్టర్ క్రాంతి వల్లూరి
సంగారెడ్డి, మే 21 (విజయక్రాంతి) : రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆందోల్ డివిజన్‌లోని మన్సాన్‌పల్లి, కన్నాన్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకొని అధికారులకు పలు సూచనాలు చేశారు.
వాతావరణంలో మార్పులకు అనుగుణంగా ఉదయమే వరి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు. ప్రతి రోజు ఐదు లారీలకు తక్కువగా కాకుండ వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎవరు ఆందోళన చెందొద్దన్నారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయి జిల్లా మేనేజర్ కొండల్‌రావు, జిల్లా పౌరసఫరాల అధికారి వనజాత, మెప్మా పీడీ గీతా, ఆర్డీవో పాండు, అధికారులు ఉన్నారు.
హెచ్‌ఎంలకు షోకాజ్ నోటీసులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వేగవంతంగా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. ఆందోల్ డివిజన్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చేపట్టిన పనులను వేగవంతం చేయడం లేదన్నారు. పనులు తనిఖీ చేసేందుకు వచ్చినా ఉపాధ్యాయులు లేకపోవ డంపై అసహనం వ్యక్తం చేశారు. పనులు పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా పనిచేస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ ఈఈ అంజయ్య, ఆర్డీవో రాజు అధికారులు ఉన్నారు.






