23 August, 2026 | 4:57 AM

10 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలి

22-05-2024 02:24 AM

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోళికేరి

సిద్దిపేట, మే 21 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, పదిరోజుల్లో కొనుగోళ్లన్ని పూర్తి కావాలని ఉమ్మడి మెదక్‌జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాల మేరకు మంగళవారం ఆమె జిల్లా లో పర్యటించారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడున్న పరిస్థితులపై జిల్లా అధికారలుతో మాట్లాడి తెలు సుకున్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన ధాన్యం వివరాల నివేదికను సమర్పించాలని జిల్లా వ్యవసాయాధికారిని ఆదేశించారు. రైతులకు కొనుగోలు కేం ద్రాల్లో టార్ఫాలిన్, ఫ్యాడి క్లీనర్లు సరిపడ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీఎంఆర్ డెలివరీపై కూడా సమీక్షా నిర్వహించి రైస్ మిల్లర్లందరు తమ కెపాసిటీ ప్రకారం మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి పంపే విధంగా చూడాలన్నారు. రైస్ మిల్లుల వద్ద స్థలభావం లేకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఓలను ఆదేశించారు. రైస్ మిల్లులో స్థల సమస్యలుంటే సమీపంలోని గోదాంలను వాడుకోవాలన్నారు. ఇప్పటికి 50,953 మంది రైతుల నుంచి 2,23,198 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 491కోట్లకు గాను 409కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయ బడ్డాయని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పౌరస రఫరాల శాఖ అధికారి తనూజ, జిల్లా మేనేజర్ హరీశ్, డీఆర్‌డివో జయదేవ్, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ ఉన్నారు.