calender_icon.png 13 November, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీప్ జిమ్మిక్కులు చేయం

30-07-2024 01:11:23 AM

అంత తక్కువస్థాయిలో నేను, సీఎం లేము

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్

పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌పై చర్చకు సమాధానం

అర్థరాత్రి తర్వాత కూడా కొనసాగిన సభ

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): చీప్ పబ్లిసిటీ, జిమ్మిక్కుల కోసం ఆరాటపడే స్థాయిలో తానుగానీ, ముఖ్యమంత్రిగానీ లేమని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పబ్లిసిటీ కోసం సీఎం, డిఫ్యూటీ సీఎం పోటీ పడుతున్నారన్న బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలను భట్టి తిప్పికొట్టారు. వార్షిక బడ్జెట్‌పై అసెంబ్లీ చర్చకు సోమవారం రాత్రి ఆయన సమాధానమి చ్చారు.

బీఆర్‌ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి విద్యుత్తు కోసం నిర్మించింది యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టులు మాత్రమేనని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్తు పునాదులే తెలంగాణను ఇప్పటికీ కాపాడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై ఎంతసేపు చర్చించటానికైనా సిద్ధమనిప్రకటించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్తు విషయంలో సరైన విధానం పాటించలేదని ఆరోపించారు.