16-02-2025 12:00:00 AM
మనం ప్రేమించిన వ్యక్తి తిరిగి మనల్ని ప్రేమిస్తే పరువాలేదు.. కానీ అలా జరగనప్పుడే ప్రేమలో విఫలమయ్యామని భావి స్తుంటారు కొంతమంది. మరీ సున్నిత మనస్కులైతే తిరస్కారాన్ని తట్టుకోలేరు కూడా.
అలాంటి సందర్భాల్లోనే మానసిక కుంగుబాటుకు గురవ్వ డం, ఆత్మహత్యా ప్రయత్నం చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఇలాంటి ప్రతికూల ఆలోచనల వల్ల నష్టాలే ఎక్కువ.
‘ప్రేమలో విఫలమయ్యాం. ఇక జీవితమంతా శూన్యం’ అనే భావన నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అందుకు చాలా మార్గాలున్నాయి.
ప్రతిఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు బాధాకరమైన సంఘటనలు, గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటికి తలొగ్గితే నష్టపోయేది మీరే. ఇలాంటప్పుడు నెగెటివ్ ఆలోచనలు మానసిక ప్రశాంతత కరవయ్యేలా చేస్తాయి. కాబట్టి వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టి ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించడం మంచిది.
‘ఇప్పటివరకు నా జీవితంలో జరిగిందంతా ఓ పీడక ల. అది నా మంచికే జరిగింది. తను ప్రేమించకపోతేనేం.. ఇంత కంటే మంచి వ్యక్తి నా జీవితం లోకి వస్తారు’ అని మిమ్మల్ని మీరే పాజిటివ్ ఆలోచనల వైపు మరల్చుకోవాలి.
దీనివల్ల మ రింత త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా పాజిటివ్‌గా ఆలోచించడం అలవాటు చేసుకుంటే.. ఎలాంటి కష్టమొచ్చినా దాన్ని సులభంగా దాటేయొచ్చు.
ఇకనైనా దూరంగా..
ప్రేమ గుడ్డిది అంటారు. అందుకేనేమో.. చాలామంది ప్రేమలో ఉన్నంతసేపు ఎదుటి వారు మంచివారా? కాదా? అనే విషయం పట్టించుకోరు. కానీ ప్రేమలో ఓడిపోయినప్పుడు మాత్రం ‘ముందే నేను ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు’ అంటూ తమని తామే దూషించుకుంటారు.
ఎదుటి వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారి ప్రేమను అంగీకరించినట్లయితే ఇలాంటి సమస్యలేవీ ఎదురుకా కుండా జాగ్రత్తపడచ్చు. అయితే కొన్నిసార్లు జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రేమలో విఫలమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటప్పుడు ఆ వ్యక్తికి, అతనితో సంబంధం ఉన్న వారికి కూడా ఎంత దూరంగా, జాగ్రత్తగా మెలిగితే అంత మంచిది.
నచ్చిన పనులు..
మనసు బాగోలేనప్పుడు ఇష్టమైన పనులు చేయడం వల్ల ఆ బాధ నుంచి ఉపశమనం కలుగుతుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో ఖాళీగా, ఒంటరిగా కూర్చుంటే ఏవేవో పిచ్చి ఆలోచనలతో మరింత కుంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖాళీగా ఉండకుండా ఇష్టమైన వ్యాపకాల కోసం ఆ సమయాన్ని కేటాయించాలి.
పంచుకోండి..
సంతోషాన్ని పంచుకున్నా.. పంచుకోకపోయినా.. బాధను మాత్రం పంచుకోవా లంటారు పెద్దలు. ఎందుకంటే మనసుకు బాధ కలిగినప్పుడు ఇతరులతో పంచుకుంటే భారం తగ్గుతుంది. అలాగే వారి నుంచి మీ సమస్యకు తగిన పరిష్కారం దొరికే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ప్రేమలో విఫలమైనంత మాత్రాన జీవితంలో అన్నీ కోల్పోయాం అనుకోవాల్సిన అవసరం లేదు.
ఆ ఆలోచన నుంచి త్వరగా బయటపడి మీకు సహాయపడే, నమ్మకస్తులైన స్నేహితులకు, ఆత్మీయులకు విషయ మంతా వివరించండి. దీంతో వారు మీకు ధైర్యం చెప్పడం, మంచి సలహాలివ్వడం.. వంటివి చేస్తారు. తద్వారా ప్రేమలో విఫలమయ్యాం అనే ప్రతికూల భావనలను మనసులోంచి క్రమంగా తొలగించవచ్చు.