28-10-2025 01:15:12 AM
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రౌడీ షీటర్లకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తారని, రాష్ట్రంలో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, గన్ కల్చర్ పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు మాట్లాడుతూ...రాష్ర్టవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు.
అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే.. ఎంఐఎం నాయ కులు, పోలీసు అధికారులపై దాడి చేసిన వారినే ఆసుపత్రిలో పరామర్శించడానికి వెళ్లడమన్నారు. ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ డైరెక్షన్‌లో రౌడీలదాడిలో గాయపడ్డ డీసీపీని కలవలేదు కానీ, పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తిని కలవడానికి మాత్రం హాస్పిటల్‌కి పరుగెత్తారని ఆరోపించారు.
రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చి తమ ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయింది కానీ, జూబ్లీహిల్స్‌లో గెలిస్తే వీళ్ల “ఆరు గ్యారంటీలు” కొత్త మేనిఫెస్ట్‌లో ఇలా మారతాయన్నారు. ‘జంట నగరాల్లోని రౌడీ షీటర్లపై కేసుల ఎత్తివేయ డం, వసూళ్లకు, హఫ్తా వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్సులు, బెదిరింపులు, దౌర్జ న్యాలపై కేసులు నమోదు చేయకపోవడం, వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు రూ.50,000 పింఛన్, రౌడీ షీటర్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, భూకబ్జాలు, సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్స్ జారీ’ వంటి గ్యారం టీలను అమలు చేస్తారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎంఐఎంతో కలిసి శాంతిభద్రతలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని, జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి పక్షమో నిర్ణయిం చుకో వాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు లు, విద్యార్థులు, ఉద్యోగులను ఆదుకోవడం లేదని, తమ పంటను కొనుగోలు చేయండని రైతులు పోలీసుల కాళ్లు పట్టుకుం టున్నా ప్రభుత్వం కనికరించడంలేదని రాం చందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతులకు బేడీలు వేస్తే, ఈ ప్రభుత్వంలో పోలీసుల కాళ్లు పట్టుకునేలా చేస్తోం దని విమర్శించారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా జీరో అయిపోయిందని, వాళ్ల “కారు” రాజకీయంగా పంక్చర్ అయిపోయిందని పేర్కొన్నారు. ఇక విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్, పింఛన్ ఇవ్వడంలేదని, రెండేళ్లుగా బెనిఫిట్స్ రావడంలేదని సీఎంకు తాను లేఖ రాసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఐదు డీఏ లు, పీఆర్సీని పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇంత పెండింగ్ డీఏలు లేవని, పెన్షనర్లకు మొత్తం రూ.12 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు.
మజ్లిస్‌ను ఆపాలంటే బీజేపీ గెలవాలి
రాబోయే ఎన్నికలలో బీజేపీ గెలిచేందు కు ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు నాంది కావాలని రాంచందర్ రావు అన్నారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల శక్తి కేంద్ర ఇన్‌చార్జ్‌ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు లు గరికపాటి మోహన్ రావు, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావులతో కలిసి రాంచందర్ రావు మాట్లాడారు.
జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌కు బీజేపీకి మధ్యనే పోటీ అన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీకి ఓటు వేయకుంటే మజ్లిస్ సీట్లు ఎనిమిదవుతాయన్నారు. మజ్లిస్‌ను ఆపాలి అంటే బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. బీజేపీకి విజయావకాశాలు పెరుగుతున్నాయని, ప్రజల్లో బీజేపీని గెలిపించాలనే ఆలోచన వచ్చిందని అన్నారు.
కుమ్రం భీం త్యాగం మరువలేనిది
జల్ జంగల్ జమీన్ నినాదంతో బ్రిటిష్ అణచివేతకు, నైజాం నిరంకుంశ పాలనకు ఎదురుగా నిలబడి ఆదివాసీల హక్కుల కోసం కుమ్రంభీం పోరాడారని రాంచందర్ రావు అన్నారు. కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కొమ్రం భీం త్యాగం, ధైర్యం, దేశభక్తి గురించి మన్‌కీ బాత్‌లో ప్రధాని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.