calender_icon.png 11 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీగల చెరువులో నీళ్లు నిలువనివ్వరా?

11-09-2025 12:51:42 AM

  1. దశాబ్దాల తరబడి అన్నం పెట్టిన చెరువు ఆగమైతదా! 

తూము నుంచి నిర్విరామంగా నీళ్లు పోతే ఎట్లా 

అధికారులకు తెలిసిన అడ్డుకట్ట వెయ్యట్లే.. 

తూము నుంచి నీరు పోకుండా చూస్తాం: అబ్బు సిద్ధికి అన్సారి, నీటిపారుదల శాఖ ఈఈ, మహబూబ్‌నగర్ 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): మనిషి మనుగడకు చెరువులు నా టి నుంచి నేటి వరకు ఎంతో దోహదపడుతున్నాయి. చెరువులో నీరు ఉంటే ఆ గ్రా మం పరిధిలో పంటలు పండడంతో పాటు పశుసంపద కు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా మనుగడ సాగించేందుకు వీలుంటుంది.

ఆధునిక కాలం పుణ్యమా.. అంది వచ్చిన అ భివృద్దా? తెలియదు కానీ ఎటు చూసినా రియల్ వ్యాపారం చేద్దాం పోవు చేసుకుం దాం మనం ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉందాం భవిష్యత్తు తరాల వ్యక్తుల భవిష్యత్తుకు మాకేంటి సంబంధం అనేలా కొందరి వ్యవహారం చూస్తే అనిపిస్తుంది. భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామానికి సమీపం లో ఉన్న తీగల చెరువు ఇటీవల కురిసిన వర్షానికి ఒక్కసారిగా చెరువు నిండా నీరు చే రుకుంది.

చెరువునిండా నీరు చేరుకున్న ఉపయోగం లేకుండా పోతుంది. తూము ద్వారా నిర్విరామంగా నీరు పోవడంతో చెరువులో నీరు అట్టడికి పోతున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్య వహరించడంతో చెరువు నీరుని ఆపేదెవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 

అసలు ఉద్దేశం ఏంటి?

డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో చెరువులు ఉండకూడదా? అసలు అధికారుల ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? లేక తీగల చెరువు ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అర్థం కాని పరిస్థితి నెలకొంటున్నాయి. ప్రధాన రో డ్డు 167 పక్కనే తీగల చెరువు ఉండడంతో ఇప్పటికే కొంతమేరకు కట్టను తొలగించి రో డ్డు వేయడం జరిగింది. అప్పటి నుంచి అధికారులు నేషనల్ హైవే అధి కారులతో ప్రత్యేక చర్చలు జరపడం జరిగింది.

ఈ కట్టకు ప్రత్యేక నిధులు తీసుకువ చ్చి కట్టను మరమ్మతులు చేస్తామని చెబు తూ వస్తున్నారు. కాగా ఆశ్చర్యలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. తీరా వర్షకాలం వచ్చిన చెరువు నిండిన చెరువు నుంచి తూ ము ద్వారా నిరంతరాయంగా నీరు పోతున్న ఎవరు పట్టిం చుకోవట్లేదు. దీంతో స్థానికులు కొందరు అసలు తీగల చెరువు ఉం టుందా? మెల్ల మె ల్లగా తొలగిస్తారా? అనే సందేహం వస్తుందని స్థానికులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. 

ముందే తెలిసిన పట్టించుకోవట్లే...

వర్షాకాలం వస్తుంది తూములు మరమ్మతులు చేయాలి చెరువుల నుంచి నీరు పో కుండా చూడవలసిన బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులకు ఉంది. ఈ విషయం సం బంధిత అధికారులకు తెలిసినప్పటికీ నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యా రని పలువురు అసలం వ్యక్తం చేస్తుండ్రు.

చెరువులు కుంటలు కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యం వ్యవహరిస్తే వాటి నీ కాపాడాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తీగల చెరువు తూము మరమ్మత్తు వెంటనే చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

తూము ద్వారా చెరువు నీళ్లు పోతున్నాయి..

తీగల చెరువు తూము కొంచెం మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది. మరమ్మతులు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మరమ్మతు చేసేందుకు మరికొంత సమయం పడుతుంది. చెరువులో నీరు ప్రస్తుతం కొంత భాగం ఉంది. త్వరలోనే మరమ్మతులు చేపట్టి నీరు బయటికి పోకుండా చర్యలు తీసుకుంటాం.

అబ్బు సిద్ధికి, నీటిపారుదల శాఖ ఈఈ, మహబూబ్ నగర్