దళారులను ఆశ్రయించవద్దు
ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
భూత్పూర్, నవంబర్ 3 : రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని కొనుగో లు చేయాలని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నా రు సోమవారం మున్సిపాలిటీ కేంద్రంతోపాటు పిఎసిఎస్ ఆధ్వర్యంలో పోతు ల మడుగు, తాటికొండ గ్రామాల్లో ఏ ర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వేసిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడవద్దని సూచించారు.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులకు ఉచిత కరెంటు రుణమాఫీ రైతు భరోసా తో పాటు తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆ దుకుంటున్న ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. రైతులు ఎవరు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, గన్ని బ్యాగులు అవసరం ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులను కోరారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కిషన్, మున్సిపాలిటీ కమిషనర్ నూ రుల్ నజీబ్, సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి లిక్కీ విజయ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






