మమ్మల్ని భయపెట్టొద్దు!
- బీజేపీ జాతీయ ఐటీసెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా
- ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌పై ఆగ్రహం
న్యూ ఢిల్లీ, జూన్ 4: రాహుల్‌గాంధీ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రజలను భయాందో ళనలకు గురిచేయడం ఆపాలని బీజేపీ జాతీయ ఐటీసెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ బుధవారం చేసిన వ్యాఖ్యల పై మాల్వియా గురువారం కౌంటర్ అటాక్ చేశారు. భారత్ ఆర్థిక వ్యవస్థ షాక్‌లను తట్టు కొనే వ్యవస్థలను నిర్మించు కుందని, ద్రవ్యో ల్బణం అదుపులోనే ఉంద ని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా సరిప డా ఉన్నాయని పదే పదే రాహుల్ ప్రజలను తప్పుదోవ పట్టించడం, భయపెట్టడం ఆపాలని అన్నా రు.
ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు భిన్నంగా వాస్తవ పరిస్థితి ఉందని మాల్వియా స్పష్టం చేశారు. ప్రజలను భయపె ట్టొద్దని, కాంగ్రెస్ హయాంలోనే ఆర్థిక సునామీ వచ్చింద న్నారు. ప్రధాని మోదీ నేతృత ్వంలో కేంద్ర ప్రభుత్వం కొవిడ్, రష్యా ఉక్రెయిన్ యు ద్ధం, ముడిచమురు లాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని దేశ ఆర్థిక వ్యవ స్థను బలోపేతం చేస్తుందని అన్నారు. భారత్ ఏం నిస్సహాయంగా లేదన్నారు. దశాబ్ధకా లంలో షాక్‌లను తట్టుకునే వ్యవస్థలను నిర్మించుకుందన్నారు.
విద్యుత్ వినియోగం, వాహనాల విక్రయాలు, ఈవే బిల్ జనరేషన్ పెరిగిందని, ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, సరఫరా, వస్తు వినియోగం, ఎగుమతులు, దిగుమ తులు ఇలా అన్ని రంగాల్లో ఆర్థిక వృద్ధి దూ సుకువెళుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూ లిందన్నారు.
2013లో వచ్చిన ఆర్థిక సునా మీ దెబ్బకు రూపాయి 36 శాతం పడిపో యిందన్నది మరిచిపోయారా? అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ దేశంలో వినాశనాన్ని సృష్టి స్తే, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృఢంగా, ఆర్థికంగా బలోపే తం అవుతూ ముందుకు వెళుతుందని అమి త్ మాల్వియా స్పష్టం చేశారు.






