5 June, 2026 | 1:12 AM

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌పై సెబీ నిషేధం

05-06-2026 12:00 AM

ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో చర్యలు

ముంబై, జూన్ 4: స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే సంస్థ బెంగళూరుకు చెందిన ప్రముఖ జ్యువెలరీ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌పై సెబీ చర్యలు తీసుకుంది. ఆర్థికక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రమోటర్ రాజేశ్ మెహతాను సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి గురువారం తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. 2021-25 ఆర్థిక సంవత్సరాల మధ్య దాదాపు రూ.15.15లక్షల కోట్ల ఆదాయం సమకూ రినట్లు కంపెనీ తప్పుడు ప్రచారం చేసుకుం దని సెబీ గుర్తించింది.

సెబీ పూర్తికాల సభ్యుడు కమలేష్ చంద్ర వర్ష్నీ 109 పేజీల మధ్యంతర ఉత్తర్వు జారీ చేశారు. ఆడిట్ నివేదికలు అందించడంలో విఫలమవడం, కీలక సమాచారాన్ని దాచి పెట్టడం, పదేపదే సమన్లు జారీ చేసినా నిధుల ప్రవాహంపై కచ్చితమైన సమాచారాన్ని అందజేయడం తో సంస్థ విఫలమైందని కమలేష్ చంద్ర వ ర్ష్నీ తన నివేదికలో పేర్కొన్నారు. సెబీ నిర్ణయం తరువాత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో ఈ సంస్థ షేర్లు భారీగా పతనమ య్యాయి.

షేర్ విలువ ఐదు శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ. 103.92కు పడిపోయింది. ఈ సంస్థలో ఎల్‌ఐసీకి కూడా 10.80 శాతం వాటాలు ఉండటంతో ఎల్‌ఐసీ షేర్లు కూడా ఒక శాతానికి పైగా పడిపోయింది. రూ. 399.80 వద్ద ట్రేడ్ కొనసాగింది. కాగా రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఏకీకృత ఆదాయంలో 97 నుంచి 99 శాతం దాని విదేశీ అనుబంధ సంస్థల నుంచి సమకూరుతోంది. అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీలను సంస్థ బహిర్గతం చేయలేదు. దీంతో సెబీ తనిఖీలు చేపట్టగా కీలక విష యాలు వెలుగులోకి వచ్చాయి.

స్విస్ సంస్థ స్టాండ్ ఎలోన్ ఆదాయం తక్కువగా ఉన్నా రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాత్రం దాన్ని పెంచి చూ పించినట్లు గుర్తించింది. తప్పుడు ప్రచారం చేయడంపై రెగ్యులేటరీ అథారిటీ చర్యలు తీసుకుంది. కాగా సెబీ చర్యలపై రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రకటన విడుదల చేసింది.

ఆర్థిక అవకతవకల ఆరోపణలను తోసిపుచ్చింది. తాము వెల్లడించిన ఆదాయ వివరాలు సరై నవే అని పేర్కొంది. కమ్యూనికేషన్ గ్యాస్, గందరగోళం వల్లే సెబీ ఆదేశాలు జారీ చేసి ఉంటుందని తెలిపింది. బెంగళూరుకు చెందిన రాజేశ్ మెహతా 1200 రూపాయల తో ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించి వందలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు.