16 July, 2026 | 3:09 AM

‘భగీరథ’ కనెక్షన్లపై ఇంటింటి సర్వే

07-06-2024 02:07 AM
  • సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా ఆగ్రవాల్

సిద్దిపేట, జూన్ 6 (విజయకాంత్రి): మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లపై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా ఆగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ మొబైల్ అప్లికేషన్‌పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లా డుతూ..  అప్లికేషన్ ద్వారా సర్వేకు సం బంధించి జిల్లాలోని పంచాయతీ సెక్రటరీలు, ఆంగన్‌వాడీ టీచర్స్, ఆశ వర్కర్లు సహా 1200 మందికి రెండు సెషన్లలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో సుమారు 2.17 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయని, ఈ సరే ముఖ్య ఉద్దేశం నీరు అందుతున్న, నీరు రాని కనెక్షన్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడమని చెప్పారు. ప్రతి ఆపరేటర్ ఇంటింటికి తిరిగి నల్లా కనెక్షన్ చెక్ చేసి కుటుంబ సభ్యుల వివరాలను ఈ మొబైల్ అప్లికేషన్ లో ఎంట్రీ చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు, మేజర్ పంచాయతీల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు మానిటర్ చేయాలని తెలిపారు. సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో రమేశ్, డీపీవో దేవి, మిషన్ భగీరథ ఎస్‌ఈ శ్రీనివాస్‌చారి, ఈఈ గిరిధర్, మాస్టర్ ట్రైనర్స్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.