ఇండ్లు లేని పేదలకు ‘డబుల్’ ఇండ్లు కేటాయించాలి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య
- ‘డబుల్’ ఇల్లు ఇవ్వకుంటే 100 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్
- ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో భారీ ధర్నా
ముషీరాబాద్, జూన్ 16 (విజయక్రాం తి): ఇండ్లల్లో పనిచేసే కార్మికులకు డబ్బులు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్‌రూమ్ లేదా 100 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వందలాది పేద లు - ఇళ్లలో పనిచేసే కార్మికులు మంగళవా రం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్కర్లను ఉద్దేశించి ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన వేలాదిమంది ప్రజలు సొంత ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇండ్లలో పాచి పనులు చేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న బలహీనవర్గాల ప్రజలు ఇంటి అద్దె చెల్లించలేక చాలి చాలని జీతాలతో అష్ట కష్టాలు పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రజాపాలనని గొప్పలు చెప్పుతున్న ఇప్పటికీ 90 శాతం మంది ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాఖలు లేవని విమర్శించారు. ఒకవైపు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను వేలం వేస్తూ మంత్రులు కబ్జా దొరలకు వందల కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారన్నారు.
ప్రభుత్వ స్థలాలు ఇల్లు లేని పేద ప్రజలకు కేటాయించాలి, కానీ వేలం వేయడం - అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ స్థలాలు అమ్మ రాదని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ తిరుగుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. శాసన సభ్యులు కృష్ణ రావు, ముఠా గోపాల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్ ప్రసంగిస్తూ ఒకవైపు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయిం చక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను వేలం వేసి దొరలకు వందల కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు.
ప్రభుత్వ స్థలాలు ఇల్లు లేని పేద ప్రజలకు కేటాయించాలి. కానీ వేలం వేయడం - అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. త్వరలో ప్రధానమంత్రిని కలిసి సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో నవనీత, లిస్సి, అల్ల్జోసఫ్, నిర్మల, పాలియ తదితరులు పాల్గొన్నారు.






