అక్రమ పట్టా పాస్‌బుక్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
17-06-2026 02:59 AM
బోధన్, జూన్ 16 (విజయక్రాంతి): ఎడపల్లి మండల కేంద్రంలో గ్రామ శివారులో గల 597, 598, 599 లో గల సుమారు 17 ఎకరాల పై చిలుకు భూమి ని అక్రమంగా రెవెన్యూ అధికారుల సహాయంతో పట్టా పాసు పుస్తకాలను సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పట్టా పుస్తకాలను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రోజున ఎం,ఆర్,ఓ కు ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మల్లెపుల శ్రీనివాస్,బర్దీపూర్ విఠల్ నాయిని లక్ష్మణ్ గౌడ్, తదితరులు ఉన్నారు.






