02-10-2024 12:00:00 AM
న్యూఢిల్లీ: పెరూలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. భారత షూటర్ రాకేశ్ మనె పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణంతో పాటు టీం ఈవెంట్‌లో కూడా స్వర్ణం సాధించాడు. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు కూడా పసిడి సొంతం చేసుకుంది. దీంతో ఈ ఈవెంట్‌లో భారత్ ఇప్పటి వరకు సాధించిన స్వర్ణాల సంఖ్య ఐదుకు చేరుకుంది.
మొత్తంగా 5 స్వర్ణాలు, మూడు కాంస్యాలు కలిపి 8 పతకాలతో పట్టికలో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. చైనా రెండో స్థానంలో ఉంది. ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభా గంలో గౌతమి నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. జూనియర్ మహిళల స్కీట్ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. పురుషుల స్కీట్ ఈవెంట్లో కూడా మన ప్లేయర్లు సత్తా చాటలేకపోయారు.