calender_icon.png 20 August, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల

20-08-2025 12:42:43 PM

హైదరాబాద్: తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల(Liquor Shop Licenses) జారీకి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ఫీజు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు రెండేళ్ల కోసం లైసెన్స్ లు జారీ చేయనుంది సర్కార్. ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్ ల గడువు నవంబర్ తో ముగియనుంది. మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రిజర్వేషన్లు కల్పించింది. గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 6 స్లాబుల ద్వారా లైసెన్స్ ల జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. మద్యం దుకాణాల లైసెన్స్‌లను 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం జారీ చేయనుంది.