అణగారినవర్గాల మార్గదర్శకుడు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్
కొత్తగూడెం మేయర్ మూడు గణేష్
పాల్వంచ, ఏప్రిల్ 5, (విజయక్రాంతి): అణగారిన వర్గాల ప్రజలు. ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో ముందుండాలని మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మార్గదర్శకుడుగా నిలిచిన మహనీయుడని కొత్తగూడెం మేయర్ మూడు గణేష్ కొనియాడారు. ఆదివారం పాల్వంచ ప్రధాన సెంటర్లోని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మేయర్ మాట్లాడుతూ భారత దేశ ఉప ప్రధానిగా. రక్షణ శాఖ మంత్రిత్వంలో దేశ ప్రజల కోసం తను చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు.
సిపిఐ పార్టీజిల్లా కార్యదర్శి సాబీర్ భాష మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థాయికి ఎదగాలని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ తన వంతు కృషి చేశారన్నారు. అంబేద్కర్ భవనానికి అవసరమైన నిధులను ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు ద్వారా నిధులు మంజూరి చేపి స్తామని అన్నారు.
డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ ఆశయాలను ముందు తీసుకొని వెళ్లాలని గుర్తు చేశారు , డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవా సమితి అధ్యక్షులు దండోరా శ్రీను, గౌరవ అధ్యక్షులు కార్పొరేటర్ కాల్వ భాస్కర్, కొత్తపల్లి సోమయ్య,గుర్రం వెంకట రత్నం, గజ్జి శ్రీను, రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో ముందుగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేశారు.
కార్పొరేటర్ కొత్వలా లలిత కేక్ కట్ చేసి అందరికీ ధన్యవాదములు తెలిపారు, కార్పొరేటర్లు సుగుణ, సింధు తపస్విలను కమిటీ సభ్యులు ను ఘనంగా సన్మానించారు. పలు పార్టీలకు చెందిన నాయకులు. ట్రేడ్ యూనియన్. ఉద్యోగ సంఘాల నాయకులు ముత్యాల విశ్వనాథము, పూర్ణ, నరాటి ప్రసాద్, ఇనుపనూరి కుమార్, యస్కె బాషా, చేకూరు భాగ్యలక్ష్మి, బోగిని సందీప్, నిమ్మల రాంబాబు, శ్రీను, దేవీలాల్ గుగులోత్, ఉప్పుశెట్టి రాహుల్, సమ్మయ్య, దాసరి యాకయ్య తదితరులు పాల్గోన్నారు.
కార్పొరేటర్ విజయలక్ష్మి కుమారుడు మృతికి సంతాపం..
పాల్వంచ 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి పట్ల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవా సమితి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. వైద్యశాలలో చికిత్స పొందుతున్న కార్పొరేటర్ విజయలక్ష్మి పరామర్శించారు. మృతి చెందిన విజయలక్ష్మి కుమారుడు విక్కీ మృతదేహాన్ని సేవా సమితి కమిటీ సభ్యులు సందర్శించి నివాళులర్పించారు.




