6 April, 2026 | 3:44 AM

జగ్జీవన్ రామ్ స్ఫూర్తిని కొనసాగించాలి: ఎమ్మెల్యే బీఎల్‌ఆర్

06-04-2026 01:39 AM

మిర్యాలగూడ, ఏప్రిల్ 5: అణగారిన వర్గాల ఆశాదీపం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తిని కొనసాగించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. ఆదివారం జగ్జీవన్ రామ్ 119వ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  అంటరానితనం నిర్మూలనకు, దళితుల మరియు వెనుకబడిన తరగతుల సాధికారతకు  చేసిన కృషి అనిర్వచనీయం అన్నారు. 

కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పలు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణ లోని బాబుజగ్జీవన్ రావ్ విగ్రహానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలి కాంతరెడ్డి, సామాజికవేత్త డాక్టర్ రాజు,కాశయ్య,

మొండి కత్తి లింగయ్య, పరుశురాములు, దైవ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్, డాక్టర్ రాజు, బీసీ జేఏసీ కో కన్వీనర్లు జయరాజు, మురళియాదవ్, పిల్లలమర్రి రవికుమార్, తిరుపతయ్య, జవాజి మహేష్ యాదవ్  పాల్గొన్నారు.