ఖమ్మంలో బాలికపై లైంగిక దాడి
హైదరాబాద్: 12 ఏళ్ల బాలికపై ఓ కామంధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ కి ఓ కుటుంబం కాపలాగా ఉంటుంది. అదే అపార్ట్ మెంట్ కు చెందిన ఓ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో బాలిక భయపడి కేకలు వేసింది. దీంతో కంగారు పడిన నిందితుడు బాలికను భవనం పైనుంచి కిందకి తోసేశాడు.
దీంతో బాలిక వెన్నెముక, చేతులు, కాళ్లు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆ బాలికను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ నెల 6వ తేదీన బాలికపై లైంగిక దాడి జరగగా, అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.






