18 August, 2026 | 1:17 AM

నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ కోట నీలిమ

18-08-2026 12:00 AM

సికింద్రాబాద్,ఆగస్టు17 (విజయక్రాంతి): నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పద్మారావు నగర్ డివిజన్లోని రేణుక ఎల్లమ్మ నాగదేవత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. ఈ సందర్భంగా నాగదేవతకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంద రూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఆలయానికి చేరుకున్న డాక్టర్ కోట నీలిమకు ఆలయ నిర్వాహకులు, ప్రధాన పూజారులు ఆలయ సంప్రదాయాల ప్ర కారం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మా ట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు.

నాగుల పంచమి మన సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన పర్వదినమని, ప్రకృతితో మానవ జీవనానికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే పండుగగా దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. నాగదేవత అనుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమ, సోదరభావం, ఐక్యతతో ముందుకు సాగాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఈ పవిత్ర పర్వదినాన ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.