9 July, 2026 | 5:10 AM

చేవెళ్ల మున్సిపాలిటీలో డ్రైనేజీ లీక్

09-06-2025 01:56 AM

సమస్యను పరిష్కరించాలని స్థానికుల విజ్ఞప్తి

చేవెళ్ల, జూన్ 8: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప గుడి పక్కన ఉన్న గణేష్ నగర్ కాలనీలో కొద్ది రోజులుగా డ్రైనేజీ లీక్ అవుతోంది.  కాలనీ వాసుల ఫిర్యాదు మేర కు మున్సిపల్ సిబ్బంది మూడు రోజుల కిం ద క్లీన్ చేసి వెళ్లారు.  కానీ తెల్లారి నుంచే డ్రైనే జీ వాటర్ మళ్లీ రోడ్లపై పారుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  పాత లైన్ తీసివేసి కొత్తది వేయాలని , కనీ సం లీకేజీ లేకుండా రిపేర్ చేయాలని కోరుతున్నారు. 

అసలే వర్షాకాలం కావడంతో జాప్యం చేస్తే రోగాల బారిన  పడుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే హౌ సింగ్ బోర్డు కాలనీలోనూ ఇదే సమస్య ఇబ్బంది పెడుతోంది.  వారం రోజులుగా డ్రైనేజీ లీక్ అవుతుందని, మున్సిపల్ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులుకోరుతున్నారు