4 June, 2026 | 1:44 AM

వినాయక హిల్స్‌లో డ్రైనేజీ సమస్యకు త్వరలోనే పరిష్కారం

04-06-2026 01:06 AM

కాంగ్రెస్ నేత బోయపల్లి రాఘవేందర్ రెడ్డి

బడంగ్‌పేట్, జూన్ 3 (విజయకాంతి): మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ నాదర్ గుల్ 57వ డివిజన్ పరిధిలోని అల్మాస్గూడ వినాయక హిల్స్ కాలనీలో దీర్ఘకాలంగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుందని ఏఐసిసి విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం వినాయక హిల్స్ కాలనీలో నెలకొన్న స్థానిక డ్రైనేజీ సమస్యలను మున్సిపల్ డీఈ అభినవ్ తో కలిసి రాఘవేందర్ రెడ్డి పరిశీలించారు. కాలనీ వీధుల్లో పర్యటించి సమస్య తీవ్రతను అడిగి తెలుసుకన్నారు. రేపటి నుంచి డ్రైనేజీ మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభిస్తామని కాలనీవాసులకు డిఈ హామీ ఇచ్చినట్లు రాఘవేందర్ రెడ్డి చెప్పారు.

స్థానిక సమస్యలపై సానుకూలంగా స్పందించి, తక్షణమే పనులు ప్రారంభిస్తామని భరోసా ఇచ్చిన డీఈ అభినవ్, అధికారులకు కాలనీ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు రాఘవేందర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.