4 June, 2026 | 1:44 AM

తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలి

04-06-2026 01:08 AM

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి

మలివిడత తొలి ఉద్యమకారుడు వావిళ్ల కోటేశ్వర్ రెడ్డి

రాజేంద్రనగర్, జూన్ 3 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో తెగించి పోరాడిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ మలిదశ తొలి ఉద్యమ నేత వావిళ్ళ కోటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం 25 పెన్షన్ గుర్తింపు కార్డు హెల్త్ కార్డుతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రభుత్వమే గౌరవప్రదమైన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గౌరవించాలని కోటేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమకారులు ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నరని ఆయన గుర్తు చేశారు. వనపర్తి నియోజకవర్గంలో 2001లో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉద్యమాన్ని నడిపిన జాబితాలో కోటేశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉద్యమించారు ఎన్నో అరెస్టులు కేసులు ఎదుర్కొని లాటి దెబ్బలు తిన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయనీ ఆయన గుర్తు చేశారు