9 July, 2026 | 5:44 AM

చినుకు రాలి.. పనులు సాగి

11-06-2024 12:50 AM

జయశంకర్ భూపాలపల్లి, (విజయక్రాంతి): మృగశిరలో వాతావరణం చల్లబడటంతో వానకాలం సీజన్‌కు అన్నదాతలు సమాయత్తమయ్యారు. నాగలి చేతబట్టి చేలలో దుక్కులు దున్నతూ, నారుమడులు చేస్తున్నారు. పశువుల ఎరువును పొలాల్లోకి చేరవేస్తున్నారు. దుక్కులు చదును చేస్తూ.. అచ్చు కొడుతూ.. పత్తి గింజలేస్తూ ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తూ అన్నదాతలు ఎవుసం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల్లో రైతులు ఎవుసం పనుల్లో నిమగ్నమయ్యారు.