20-08-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 19 (విజయక్రాంతి) జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ ఎల్లమ్మ టెంపుల్ వద్ద బస్ స్టాప్ ఉన్నప్పటికీ టీఎస్ 21 జెడ్ 0030 నెంబర్ గల బస్సు ప్రయాణికులు బస్సు ఎక్కెందుకు ఉన్నప్పటికీ ఆపకుండా వెళ్లిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. బస్సు కోసం గంటల తరబడి ఎదురు చూసి బస్సు ఆపకపోవడంతో ప్ర యాణికులు ఆర్టీసీ పై మండిపడుతున్నారు.
ఆ బస్సు వెళ్ళిపోతే మళ్లీ గంటల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బస్సులు వెంబడించి ఎందుకు ఆపలేవని అడుగుతే పొంతనలేని సమాధానం ఇస్తూ దురుసుగా ప్రవర్తించాడని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆర్టీసీ డ్రైవర్ల పై చర్యలు తీసు కోవాలని ప్రయాణికులు కోరుతున్నారు,