20-08-2025 12:00:00 AM
భద్రాచలం, ఆగస్టు 19 (విజయ క్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని హైదరాబాదులో వారి నివాసం లో మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాచలం నియోజకవర్గం టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ , మానే. రామకృష్ణ తదితరులు. పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నందున త్వరలో భద్రాచలం పర్యటనకు రావాలని కేటీఆర్ ని కోరగా, ఆయన అంగీకరించి వచ్చే నెలలో భద్రాచలం వస్తానని రావులపల్లి రాంప్రసాద్ మానే రామకృష్ణ తెలియజేశారు.