calender_icon.png 1 October, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిషాసురమర్దినిగా భద్రకాళి అమ్మవారు

01-10-2025 08:48:18 PM

హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరత్ర మహోత్సవములు పదవ రోజుకు చేరుకున్నాయి. పడవ రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం 4 గంటలకు అర్చకులు నిత్యాహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని మహిషాసురమర్ధినిగా అలంకరించి పూజారాధనలు జరిపారు. వరాహ పురాణాన్ని అనుసరించి సిద్దిధాత్రి దుర్గక్రమంలో భోధయనోక్త నవరాత్ర కల్పాన్ననుసరించి శుంభహా దుర్గా క్రమంలోను అమ్మవారికి పూజారాధనలు జరిపారు. ఉదయం అమ్మవారికి వసంతోత్సవం, సాయంకాలం పుష్పరత సేవ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవరాత్ర మహోత్సవాల పూర్ణాహుతి జరిగింది.

పూర్ణాహుతి కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు కుటుంబ సమేతంగా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, దేవాలయ చైర్మన్ డాక్టర్ బి శివ సుబ్రహ్మణ్యం ధర్మకర్తలు తోనుపునూరి వీరన్న, కటకం రాములు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోత్కూరి మయూరి, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాసరావు, మూగ శ్రీనివాసరావు, అనేకమంధి భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమాలకు గోవా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు విశ్వజిత్ రాణే, దేవ్యా రాణే, ఎమ్మెల్యే గోవా, ఐశ్వర్య రాణే, అరుంధతి రాణే తదితరులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. అనంతరం సాయంకాలం ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించాయి.