calender_icon.png 1 October, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాత మండపం వద్ద స్వయంభుగా వెలసిన గణనాథుడు..

01-10-2025 08:20:48 PM

మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలో బయటపడ్డ విగ్రహం..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అద్భుత ఘటన చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో దుర్గామాత మండపం వద్ద స్వయంభూగా వినాయకుడి విగ్రహం వెలిసింది. బుధవారం దుర్గా దేవి మండపం వద్ద ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజుతో పాటు కాలనీవాసులు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతుండగా ఒక్కసారిగా వినాయకుని విగ్రహం బయటపడింది. దీంతో కమిషనర్ తో పాటు కాలనీవాసులు ఆశ్చర్యానికి గురై ఆ వినాయకుని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేసారు. దుర్గమ్మ మండపం వద్ద వినాయకుని విగ్రహం బైట పడటం అంత దైవ సంకల్పమని కాలనీవాసులు పేర్కొన్నారు.