calender_icon.png 1 October, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంబీబీఎస్ సీటు సాధించిన నందిని, వెంకటేష్ గిరిజన ఆణిముత్యాలు

01-10-2025 09:01:32 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): ప్రతిభకు పేదరికం అడ్డు రాదని నిరూపించారు గిరిజన బిడ్డలు. తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి ఎక్స్ రోడ్డు తండాకు చెందిన గుగులోతు శంకర్ కుమార్తె నందిని, గుగులోతు రాజు కుమారుడు వెంకటేష్ లకు ఎంబీబీఎస్ లో సీటు దక్కింది. ఈ సందర్భంగా తండవాసులు రామకృష్ణ ఆ బిడ్డలను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. పేద కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ గిరిజన బిడ్డలు నేటి యువతకు ఆదర్శమని, గిరిజనుల అభివృద్ధి ఉన్నత విద్యతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రామకృష్ణ, పులానే, హేమ శంకర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.