calender_icon.png 1 October, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

01-10-2025 08:14:06 PM

ములకలపల్లి (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రులు ముగింపు సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం ములకలపల్లిలోని శివాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. శివాలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు శివాలయం ఆలయ కమిటీ చైర్మన్ నరాటి ప్రసాదు, కమిటీ సభ్యులు ఆహ్వానం పలికి శాలువాతో సత్కరించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం అందించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో పాటు ఎమ్మెల్యే వరుసలో నిలబడి అన్నదానాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.