01-10-2025 08:59:11 PM
పాల్గొన్న ఎమ్మెల్యే..
అలరించిన నృత్యాలు..
ఇటిక్యాల: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం షేకుపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు ప్రతీక... మన ఆడబిడ్డలు ఆత్మగౌరవానికి చాటే గొప్ప పూల వేడుక అని ప్రతి ఆడపడుచు ఇంట్లో వెలుగులు నింపాలని బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను కొనియాడారు. అనంతరం మహిళలు రంగురంగుల పువ్వులతో పేర్చిన బతుకమ్మ చుట్టూ మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు ఆటపాటలతో నృత్యాలు చేశారు. అనంతరం నాయకులు, రవీందర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేను శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, వావిలాల రంగారెడ్డి, హనుమంతు రెడ్డి, కిషోర్, పరమేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.