calender_icon.png 1 October, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియా వర్క్ షాప్ లో ఆయుధ పూజ

01-10-2025 08:56:10 PM

మందమర్రి (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని దసరా పండుగ సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో ఏరియా వర్క్ షాప్ లో బుధవారం వాహనాలకు, పనిముట్లకు ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణలు ముఖ్య అతిధులుగా హాజరై, ముందుగా వర్క్ షాప్ లోని మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వర్క్ షాప్ లోని వాహనాలకు, పనిముట్లకు ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ, వర్క్ షాప్ లోని అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు, ఎలక్ట్రిషన్లు, ఫిట్టర్లు, కార్మికులు రక్షణతో కూడిన పనిని చేయాలని సూచించారు.

బొగ్గు ఉత్పత్తికి అనుసంధానంగా పనిచేస్తూ, అన్ని విభాగాల కార్మికులు సరైన సమయానికి అన్ని ఎరక్షన్స్ చేసి. ఉత్పత్తికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ డివైజిఎం ధూప్ సింగ్, ఏఐటియుసి నాయకులు భీమనాథుని సుదర్శన్, వర్క్ షాప్ అధికారులు, ఇంజనీర్లు సదానందం, నరేష్, శ్రీనివాస్, సత్య గౌడ్, ఏఐటియుసి నాయకులు పెద్దపల్లి బానయ్య, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, సిహెచ్పి శర్మ, పారిపల్లి రాజేశం, కొండ్రు వెంకటేశం, వర్క్ షాప్ కార్యాలయ విభాగం సిబ్బంది జాడి సంతోష్, రాజకుమార్, అన్ని సెక్షన్ల సూపర్వైజర్లు, కార్మికులు పాల్గొన్నారు.