01-10-2025 08:54:15 PM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మండల తహశీల్దార్ సతీష్..
మందమర్రి (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని కేకే 1 సిఎస్పి సమీపంలో గల దుర్గ భవాని దేవాలయంలో నిర్వహిస్తున్న నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పదవ రోజైన బుధవారం అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనకు స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సన్మానించి, ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నర్సింగ్ భవాని దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.