calender_icon.png 13 January, 2026 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐఎఫ్టిపి దక్షిణ భారత విభాగంలో మంథని వాసికి చోటు

13-01-2026 01:52:20 PM

సంయుక్త కార్యదర్శి గా నగేష్ రంగి  

మంథని,(విజయక్రాంతి): హైదరాబాద్ లో ప్రముఖ టాక్స్ అడ్వకేట్ నగేష్ రంగి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టిషనర్స్ (ఏఐఎఫ్టిపి) దక్షిణ భారత విభాగం నిర్వాహణ కమిటీలో సంయుక్త కార్యదర్శిగా  2026 గా  నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఈ పదవికి  మంథని చెందిన న్యాయవాది జాతీయ స్థాయిలో ఎంపిక కావడం విశేషం. దేశవ్యాప్తంగా వేలాది టాక్స్ ప్రాక్టిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఐ ఎఫ్ టి పి వంటి ప్రతిష్టాత్మక జాతీయ సంఘంలో  దక్షిణ భారత విభాగంలో సంయుక్త కార్యదర్శి గా పదవి పొందటం ఆనందంగా ఉందని రంగి నగేష్ తెలిపారు.  ఈ ఎన్నిక ద్వారా  వృత్తిపరమైన నైపుణ్యం, సంస్థాగత అనుభవం, నాయకత్వ ప్రతిభకు జాతీయ స్థాయిలో సంపూర్ణ గుర్తింపు లభించినట్లు భావిస్తున్నారు.

గతంలో నగేశ్ రంగి తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్  అధ్యక్షులుగా వరుసగా రెండు పర్యాయములు బాధ్యతలు చేపట్టి, సంఘాన్ని సుస్థిరమైన మార్గంలో ముందుకు నడిపించారు. 2025లో సదరన్ జోన్ తెలంగాణ సమన్వయకర్త గా బాధ్యతలు నిర్వర్తించారు. వీరు సంఘ సభ్యుల సంక్షేమం, వృత్తి పరమైన సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో నిరంతర కృషి చేస్తున్నారు. సంఘ అభివృద్ధికి విశేష సేవలు అందించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల టాక్స్ ప్రాక్టిషనర్ల సమస్యలను ఉన్నత వేదికలపై ప్రస్తావించారు. జీఎస్‌టి అమలు, చట్టపరమైన మార్పులు, ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న సవాళ్లపై అనేక అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. 

వృత్తి పట్ల అపారమైన అంకితభావం, నాయకత్వ సామర్థ్యం, క్రమశిక్షణతో కూడిన నిరంతర సేవలను పరిగణనలోకి తీసుకున్న ఏఐఎఫ్టిపి జాతీయ నాయకత్వం రంగి నగేష్ తో పాటు తెలంగాణకు చెందిన  ఖమ్మం జిల్లా వాసి ఉల్లిబోయిన సైదులు 2026–27 కాలానికి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోఆప్టెడ్ సభ్యలు గా వసంత కుమార్ రెడ్డి  నియమితులయ్యారు. ఈ ఎన్నిక ద్వారా తెలంగాణ నుండి,  జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం లభించిందని వృత్తి వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సదరన్ జోన్ లో వీరితో పాటు తెలంగాణ నుండి టి వి సుబ్బారావు సమన్వయకర్తగా, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా హైదరాబాద్ నుండి విఠల్ రామరాజు, కాట్రగడ్డ నరేంద్రబాబు,   కె.నర్సింగ రావు, రమణమూర్తి, బాలకృష్ణ, సమ్మయ్య, దుర్గాప్రసాద్ రావు ఖమ్మం, మల్లికార్జున్ దేవ్ కరీంనగర్, వెంకటరమణ, నల్గొండ తదితరులు ఎన్నికైన్నారు.

ఈ నియామకం యువ టాక్స్ ప్రాక్టిషనర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర టాక్స్ ప్రాక్టీషనర్ల సమస్యలను జాతీయ వేదికపై మరింత బలంగా ప్రస్తావించేందుకు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నియామకంతో కష్టపడి పనిచేస్తే  జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధ్యమేనన్న నమ్మకాన్ని బలపరుస్తోందని తెలియజేసారు.