13 July, 2026 | 3:40 AM

సన్‌సిటీలో డ్రగ్స్ సీజ్.. యువతీ, యువకుడు అరెస్ట్

30-05-2024 03:47 PM

హైదరాబాద్: రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సన్‌సిటీ దగ్గర 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు సీజ్‌ చేశారు. ఓ యువకుడితో పాటు యువతిని అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్ అమ్ముతుండగా ఎక్సైజ్ పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఈవెంట్‌ మేనేజర్‌కు డ్రగ్స్‌ అమ్ముతుండగా ఇద్దరిని అరెస్ట్‌ చేసిన శంషాబాద్‌ ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.