13 July, 2026 | 4:36 AM

షిరిడి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులో బ్యాగుల మాయం

30-05-2024 01:59 PM

హైదరాబాద్: షిరిడి నుంచి హైదరాబాద్ వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల బ్యాగులు మాయమయ్యాయి. తుల్జాపుర్ పెట్రోల్ బంక్ వద్ద బస్సు ఆగడంతో లగేజీ స్టోర్ తాళం పలగొట్టిన దుండగులు బ్యాగులు ఎత్తుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాగులు లేకపోవడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోయారు. గతంలో కూడా అదే పెట్రోల్ బంక్ వద్ద వేరే బస్సులో దొంగలు చోరీకి పాల్పడ్డారు.