6 July, 2026 | 1:10 PM

Breaking News

నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •  

సమాజంలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాలి

26-06-2025 12:03 AM

వనపర్తి టౌన్ జూన్ 25: వనపర్తి జి ల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. జూన్ 20 నుంచి 26 జిల్లాలో వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు నిర్మూలన కార్యక్రమంలో భాగంగ బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి డ్రగ్స్ నిర్మూలన గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యు వత మాదక ద్రవ్యాల వినియోగం బారిన పడకుండా తల్లిదండ్రులు,అధ్యాపకులు,స మాజంలోని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని సూచించారు.మాదక ద్రవ్యాల విని యోగం మరియు రవాణా పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు జూన్ 26 న ఉదయం 7.00 గంటలకు స్థానిక బాయ్స్ జూనియర్ కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, పోలీస్ అధికారులు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నిర్ములన అందరి బాధ్యత

రాజాపూర్ జూన్ 25: మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని తాసిల్దార్ రాధాకృష్ణ, ఎస్త్స్ర శివానంద్ గౌడ్ అ న్నారు. బుధవారం రాజాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో అంతర్జాతీయ మాదకద్ర వ్యాల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థుల కు అ వగాహన కల్పించారు. అనంతరం మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల చదువుకు నే బాలబాలికలకు వాలీబాల్ టోర్నమెంట్ క్రీడాపోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అ న్నారు. సమాజంలో గౌరవంగా జీవించాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల ని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్, ఎచ్ ఎం శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఎల్లయ్య, రఘునందన్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.