calender_icon.png 10 December, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్

08-12-2025 12:37:28 AM

-పట్టుబడ్డ 426 మంది మందు బాబులు

శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (విజయక్రాంతి) : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.శనివారం రాత్రి 16 పిఎస్ లిమిట్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 426 మంది మద్యం సేవించిన వారు చిక్కారు.

ఇందులో 323 టూ వీలర్స్, 17 త్రీ వీలర్స్,85 ఫోర్ వీలర్స్, 1 హెవీ వెహికల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు,ఇతరుల ప్రాణాలకు కారణమైన వారిపై భారతీయ న్యాయ సన్హిత 2023 చట్టం, 105 సెక్షన్ కింద గరిష్ఠంగా 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.