08-12-2025 12:37:19 AM
మహబూబాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): రాజకీయాల్లో శాశ్వత బంధుత్వం, శాశ్వత శత్రుత్వం లేదనడానికి ఇదో తార్కాణంగా నిలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామ సర్పంచ్ పదవి కోసం సొంత అన్నదమ్ముల భార్యలు తోడికోడళ్లు పోటీ పడుతున్నారు. గ్రామానికి చెందిన వేల్పుల రామచంద్రయ్య భార్య సుజాత, ఆయన తమ్ముడు యాకయ్య భార్య రేవతి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.
అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సుజాత ఎన్నికల బరిలో నిలవగా, అదే పార్టీ సానుభూతిపరుడైన యాకయ్య భార్య రేవతిని ఎన్నికల బరిలో నిలిపాడు.తోడికోడళ్లు ఇద్దరు వారికి కేటాయించిన గుర్తులతో గ్రామంలో తమను గెలిపించాలంటే తమను గెలిపించాలంటే పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సొంత అన్నదమ్ములు రాజకీయాల కారణంగా విడిపోయి ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో గ్రామస్తులు ఎవరిని గెలిపిస్తారన్నది ఫలితాలు అనంతరం తేలనుంది.