29-08-2025 04:34:40 AM
హెడ్ లే(కా)నిస్టేబుల్, తప్పతాగి ఊగిన వైనం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
పెన్ పహాడ్, ఆగస్టు 28 : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లోని పోలీస్ స్టేషన్ లో ఓ పోలీస్ ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తూ నిత్యం మత్తులో విధులు నిర్వర్థిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకోపోవడంతో నాలుగో సింహం నవ్వుల పాలవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని ఏ గ్రామం నుండైనా సివిల్ పంచాయితీ వస్తే చాలు విచారణ పేరుతో వెళ్లడం ఇక మత్తు గేమ్ ప్రారంభించడం పరిపాటి.
పోలీస్ స్టేషన్ లో నిత్యం మత్తులో ఉండి కూడా డ్యూటీ చేయడం ఈయన నైజం అంటూ మండల ప్రజల నుండి వినిపిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా గురువారం ఈయన మత్తుతో తూగుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఈయన ఆగడాలపై మండలంలో బారీగా చర్చలు జరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా అనాజిపురం గ్రామంలో ఇరువురు పాలివారి మధ్యలో గత కొంత కాలంగా వ్యవసాయ భూమి పంచాయితీ రగులుతుంది. ఈ పంచాయితీలో భాగంగానే ఇరు వర్గాలలో ఒకరు పైపులైన్ ధ్వంసం చేసారని మరొకరు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు విషయంలో బుధవారం గ్రామానికి ఎంక్వయిరీకి వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్ వినాయక చవితి పర్వదినము రోజున తన కర్తవ్యం పక్కన పెట్టి మత్తులో మునిగిపోయాడు.
ఇంకేముంది బాధితులు చెప్పేది వినకుండా తను ఏదో చెప్పడంతో వాళ్ళకు ఏమీ అర్థం కాకపోవడంతో నిర్గాంతపోయి నిలబడడం వారి వంతు అయింది. ఈయన మత్తులో నిస్సాహాయ స్థితిలో ఉన్న ఈ వీడియో బట్టబయలు అయింది. ఈ పోలీస్ ఫిర్యాదు విచారణకు వచ్చారా..? లేక మత్తు ప్రదర్శన కు వచ్చారా..? మత్తు కబుర్లు చెప్పడానికి వచ్చారా..? అని చర్చించుకోవడం గ్రామస్తుల వంతు అయింది.
విధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ వీడియోను తిలకించిన వారంతా కోరుతున్నారు. ఓ సామాన్యుడు బైకుపై బయటకు వెళ్ళితే డ్రైవింగ్ లైసన్స్, బండి కాగితాలు, మద్యం తాగావా ని పైప్ లు పెట్టి.. కేసులు పెట్టి.. కోర్టులో సిగ్గు పోయేలా హాజరు పరిచే వాళ్లే ఇలా డ్యూటీలో మద్యం సేవించి.. మద్యం మత్తులో విదులు చేస్తూ నవ్వులపాలైన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని మండల ప్రజలు కోరుతున్నారు.