2 July, 2026 | 8:18 AM

23న డీఎస్సీ స్పోర్ట్స్ అభ్యర్థుల మహాధర్నా

22-06-2025 12:00 AM

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా ఫలితాలను విడుదల చేయాలని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాం డ్ చేసింది. గత ఆరు నెలల నుంచి తుది నివేదిక, ఫలితాలను విడుదల చేయకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారని అభ్యర్థులు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.

దీనికి నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్నాను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు దఫాలుగా సర్టిఫికెట్ వెరిఫి కేషన్‌ను చేపట్టిన అధికారులు తుది ఫలితాలను మాత్రం ఇంత వరకూ ప్రకటించలేదని, వెంటనే వాటిని విడుదల చేయాలని అధికారులను అభ్యర్థు లు డిమాండ్ చేశారు.