calender_icon.png 16 December, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల నిర్లక్ష్యం.. అభ్యర్థికి కేటాయించిన గుర్తు మిస్

15-12-2025 12:10:47 AM

వనపర్తి, డిసెంబర్ 14 (విజయక్రాంతి): వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామంలో రెండో విడత జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గ్రామపంచాయతీలో 8వ వార్డులో తప్పెట శేషమ్మ అనే అభ్యర్థికి కేటాయించిన గ్యాస్ పొయ్యి గుర్తు బ్యాలెట్ పేపర్లో రాకపోవడంతో అభ్యర్థి మరియు మద్దతుదారులు ఆందోళన చేశారు. దీంతో అధికారులు గత్యంతరం లేక పోలింగ్ నిలిపివేశారు.

అయితే ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ప్రజలు విమర్శించారు. ఇక ఈ విషయాన్ని ఎనిమిదో వార్డు గ్రామ ఎన్నికల అధికారి మండల అధికారులకు తెలియజేయడంతో హుటాహుటిన కొత్త బ్యాలెట్ పేపర్లను తీసుకొని వచ్చి పోలింగ్ అయిన 50 పాత బ్యాలెట్ పేపర్ల స్థానంలో కొత్త బ్యాలెట్ పేపర్లు తీసుకొని వచ్చి పోలింగ్ నిర్వహించడంతో గొడవ సద్దుమణిగింది.